బ్రేకింగ్ – ధోనీ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

బ్రేకింగ్ - ధోనీ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

0
106

బీ టౌన్ లో వరుస విషాదాలు జరుగుతున్నాయి..ధోనీ జీవితచరిత్రలో టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆయన ఉరివేసుకున్నారు. ఈ విషయం ఆయన ఇంటిలోని పనివారు పోలీసులకు తెలిపారు,

ఇంకా ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, సుశాంత్ సింగ్ బిహార్లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు. ఇలా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పీకేలో ఒక కీలక పాత్ర పోషించాడు.భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ జీవితకథతో వచ్చిన ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఇలా అర్దాంతరంగా ఆయన మరణం చెందడం పై అందరూ షాక్ అయ్యారు.