తమిళ సినీ ఇండస్ట్రీలో బాగా వినిపించే హీరోయిన్ పేరు వనితా విజయ్ కుమార్ , ఆమె సినిమాల్లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకుంది, అలాగే వరుస వివాహాలతో మరింత పేరు తెచ్చుకుంది,
సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా ఆమె సినిమా పరిశ్రమలోకి వచ్చింది.
ఇక వివాదాలతో ఆమె తమిళ పరిశ్రమలో పాపులర్ అయింది, ఇక 40 ఏళ్ల వయసులో పిల్లలతో ఈ మధ్య మూడో వివాహం చేసుకుంది.. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
అయితే పీటర్ కు అంతకుముందు వివాహం అయింది, అతని మొదటి భార్యఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఇలా కేసు ఉన్న సమయంలో ఈ జంట గోవా ట్రిప్ వెళ్లారట..ఈట్రిప్ లో మద్యం తాగి పీటర్ వనితని కొట్టాడని టాక్. చెన్నైకి రాగానే వనిత కోపంతో పీటర్ ఇంటి నుంచి తరిమేసిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంకా ఎవరూపెదవి విప్పలేదు.