బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో బిగ్ బాస్ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు… ఏ భాషలో తీసుకున్నా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది..ముందు మన దేశంలో హిందీలో ప్రారంభం అయింది ఆ తర్వాత పలు భాషల్లో విస్తరించింది, మన తెలుగులో కూడా గత ఏడాదితో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది, ఈ ఏడాది ఐదో సీజన్ స్టార్ట్ అవ్వనుంది.
హిందీలో 14వ సీజన్ ను పూర్తి చేసుకుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా గత సంవత్సరం అక్టోబర్ లో మొదలైన 14వ సీజన్ నిన్నటి ముగిసింది, ఇక ఇక్కడ సీజన్ 14 విజేత ఎవరో తెలుసా రుబీనా దిలైక్..ఆమె విజేతగా నిలిచారు.
ఆమెకి దాదాపు 36 లక్షల ప్రైజ్ మనీ అందించారు.
ఈ సీజన్ లో షోలో రన్నరప్ గా రాహుల్ వైద్య నిలిచారు. ముందు నుంచి వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటి కనిపించింది, ఫైనల్ గా ఆమె విన్నర్ అయ్యారు.., రాఖీ సావంత్ రూ. 14 లక్షలు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు..ఫినాలేకు ముఖ్య అతిథిగా హాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ధర్మేంద్ర వచ్చారు.