ఈ 2020 చిత్ర సీమకు అస్సలు కలిసి రాలేదు అనే చెప్పాలి.. చాలా మంది సీని ప్రముఖులు కరోనాతో కన్నుమూస్తే మరికొందరు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు, ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ శాండిల్ వుడ్ కోలీవుడ్ మలయాళ చిత్రసీమ బెంగాల్ చిత్ర సీమ ఇలా అన్నీ పరిశ్రమల్లో, చాలా మందిని కోల్పోయాం.
తాజాగా మలయాళ ఇండస్ట్రీలో విషాద ఘటన జరిగింది..అనిల్ నేదుమంగాడ్ అనే నటుడ్ని కోల్పోయింది చిత్ర సీమ.మలయాళ చిత్ర సీమలో ఈయనకు మంచి పేరుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా రీమేక్ చేస్తున్న అయ్యప్పనమ్ కోషియం సినిమాలో అనిల్ ప్రముఖ పాత్రలో నటించాడు.
తోడుపుళలోని మలంకర ఆనకట్ట దగ్గరికి తన స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఆయన అందులో మునిగిపోయారు, చివరకు ప్రాణాలు విడారు ఆయన, అక్కడ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వచ్చారు అని తెలుస్తోంది..పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్, పెరోల్, అయ్యప్పనమ్ కోషియం వంటి చిత్రాల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది, బుల్లితెరలో అలరించి తర్వాత ఆయన చిత్ర సీమలోకి అడుగు పెట్టారు, ఆయన మరణంతో చిత్ర సీమ ప్రముఖులు సంతాపం తెలిపారు.