మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150, సైరా సినిమాలతో సూపర్ సక్సెస్ లో ఉన్నారు, ఇక తాజాగా ఆయన ఆచార్య సినిమా చేస్తున్నారు, జనవరి చివరి నాటికి ఆయన షూటింగ్ పూర్తి అవుతుంది.. ఫ్రిబ్రవరి నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో చేరతారు. అయితే ఆయన ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలు ఒకే చెప్పారు.. ఈ ఏడాది సినిమాలతో చిరు బిజీగానే ఉంటారు.
అంతేకాదు చాలా మందికి అవకాశాలు ఇవ్వడంలో చిరు ఎప్పుడూ ముందు ఉంటారు… కొత్తవారిని ఎంకరేజ్ చేస్తారు, అయితే తన తదుపరి సినిమాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు చిరు…మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.
తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు ఈ చిత్రం…. ఇటీవల ఈ విషయం తెలిపారు..అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికి వచ్చింది… మలయాళం లూసిఫర్ లో మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. మరి ఈ పాత్ర ఎవరు చేస్తారు అంటే హీరో సత్య దేవ్ ఆ పాత్రలో నటిస్తున్నారట, అందుకే చిరుని ఆయన ఇటీవల కలిశారు అని తెలుస్తోంది..ఇద్దరూ భేటీ అయిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.