బ్రేకింగ్ – సినిమా షూటింగ్ లో కన్నడ హీరోకి గాయాలు

-

సినిమా షూటింగ్ చేసే సమయంలో నటీ నటులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు… ముఖ్యంగా ఫైట్ సీన్లు ఉన్నా  అలాగే ఫైర్ సీన్లు ఉన్నా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి, ఇక నదులు సముద్రాల దగ్గర కూడా గజ ఈతగాళ్లు ఉంటారు.. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు… అయితే తాజాగా కన్నడ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగింది.
హీరో రిషబ్ శెట్టికి ఈ షూటింగులో గాయాలయ్యాయి. ఆయన చేస్తున్న ఓ సినిమా షూటింగులో భాగంగా
పెట్రోల్ బాంబులు వేయాల్సిన సన్నివేశాలున్నాయి. ఇక ఆయనతో పాటు మరో నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు విసిరి పారిపోవాల్సిన సన్నివేశాలను షూట్ చేయాలి. కాని ఈ సమయంలో ఒక్కసారిగా పెట్రోబాంబులు పేలిపోయాయి.
దీంతో వారికి కొంచెం గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి, ఈ ప్రమాదంలో వారికి స్వల్పగాయాలు అయ్యాయి, అయితే దీనిపై పోలీసులు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. కన్నడ చిత్ర సీమలో దర్శకుడి నుంచి హీరోగా ఆయన మారారు, ఇప్పుడు దాదాపు ఆయన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...