టాలీవుడ్ ప్రముఖ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాహనానికి తృటిలో పెను ముప్పు తప్పింది. తాజాగా ఆయన పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.. అయితే అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నఆయన కారవాన్ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ఇందులో ఆయన లేరు కేవలం ఆయన టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయన కారులో షూటింగ్ నుంచి వెళ్లిపోయారట, అయితే ఇలా ఆయన కారవాన్ కు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు, అయితే ఇందులో తప్పు ఎవరిది అనేది తెలియాల్సి ఉంది…ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం దగ్గర ఈ ఘటన జరిగింది.
ఆ కారవాన్ అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి చేయించుకున్నారు, అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
రంపచోడవరం అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్ను ఈ రోజే ముగించుకున్నారు..అల్లు అర్జున్ కారవాన్ ఖరీదు రూ.7 కోట్లు
ఉంటుంది అంటున్నారు, దీనికి ఫాల్కన్ అనే పేరు పెట్టాడు అల్లు అర్జున్.