బ్రేకింగ్ – నటి ఆత్మహత్య షాక్ లో చిత్ర పరిశ్రమ

బ్రేకింగ్ - నటి ఆత్మహత్య షాక్ లో చిత్ర పరిశ్రమ

0
123

బీ టౌన్ లో మరీ ముఖ్యంగా సీరియల్స్ కు బుల్లితెర షోలకు ఎంతో క్రేజ్ ఉంటుంది, ఆ ఆర్టిస్టులకు అంతే పేరు వస్తుంది, అయితే ఈ లాక్ డౌన్ వేళ యువ హిందీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు.
ఆమె రాత్రి ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు అని కుటుంబ సభ్యులు తెలిపారు,
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది ఈనటి.

క్రైం పెట్రోల్ , లాల్ ఇష్క్, మేరి దుర్గ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ప్యాడ్ మ్యాన్లోనూ ఒక పాత్ర పోషించారు. ఆమె వయసు 25 సంవత్సరాలు, రాత్రి ఉరివేసుకుని ఆమె చనిపోయింది, ఉదయం ఆమె తండ్రి రూమ్ లో కూతురిని చూసే సరికి ఆమె చనిపోయింది.

ప్రేక్ష గదిలో సూసైడ్ నోట్ దొరికిందని, అయితే, దానిలో తన ఆత్మహత్యకు గల కారణాన్ని రాయలేదని పోలీసులు వెల్లడించారు, ఈ లాక్ డౌన్ వేళ పనిలేకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి, లాక్ డౌన్ ప్రకటించడంతో ఆమె ముంబై నుంచి సొంత ప్రాంతానికి వచ్చేశారు, ఇంతలో ఈ విషాదం జరిగింది.