బ్రేకింగ్ న్యూస్ …అజిత్ కు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు

బ్రేకింగ్ న్యూస్ ...అజిత్ కు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు

0
95

కోలీవుడ్ అగ్ర కథానాయకుల్లో అజిత్ ఒకరు.. ఆయనకు మాస్ క్లాస్ ప్రేక్షక అభిమానులు ఉన్నారు.. ఆయన సినిమా వస్తోంది అంటే తమిళనాట పండుగ అనే చెప్పాలి, అజిత్ కోసం దర్శక నిర్మాతలు కూడా సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. అయితే తాజాగా అజిత్ కు షూటింగ్ సమయంలో గాయాలు అయ్యాయట.

అజిత్ హీరోగా ఖాకి దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వంలో వలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అని తెలుస్తోంది. తాజాగా ఓ బైక్ ఛేజింగ్ సీన్ను చిత్రీకరిస్తున్నప్పుడు బైక్ స్కిడ్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సమయంలో డూబ్ లేకుండా అజిత్ ఆ సీన్ షూటింగ్ చేస్తున్నారట, అయితే అనుకోకుండా బండి స్కిడ్ అవడంతో ఆయన కిందపడ్డారు.

ఆయన చేతికి కాలికి గాయాలు అయ్యాయి అని తెలుస్తోంది… ఇరవై నిమిషాల పాటు రెస్ట్ తీసుకుని ఆ సీన్ను అజిత్ కంప్లీట్ చేసి హాస్పిటల్కు వెళ్లాడట. డాక్టర్స్ కొన్ని రోజుల పాటు రెస్ట్ సూచించారట. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో కూడా జరుగనుందట.