బ్రేకింగ్ న్యూస్ – ప్రభాస్ పై పోలీసు కేసు

బ్రేకింగ్ న్యూస్ - ప్రభాస్ పై పోలీసు కేసు

0
88

టాలీవుడ్ హీరో ప్రభాస్ పై పోలీస్ కేసు నమోదు అయింది అయితే కొద్ది నెలులగా ఆయన ఫామ్ హౌస్ గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే …మరోసారి అదే వార్తలు వినిపిస్తున్నాయి, హైదరాబాద్ రాయదుర్గం పీఎఎస్ లో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రభాస్ పై కేసును నమోదు చేశారు.

రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఇక ఇక్కడే చిక్కు వచ్చింది.. ఇది సర్కారీ స్ధలం అని శేరిలింగం పల్లి ఎమ్మార్వో దీనిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సీజ్ చేశారు.

అయితే సీజ్ చేసిన ఆ ప్రాంతానికి వేరే వారు ఎవరూ వెళ్లకూడదు కాని ఈ లాక్ డౌన్ వేళ ప్రభాస్ తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.