బ్రేకింగ్ న్యూస్ – రానా-మిహికా వివాహ తేదీ ఇదే

బ్రేకింగ్ న్యూస్ - రానా-మిహికా వివాహ తేదీ ఇదే

0
77

ఇటీవలే రానా తన ప్రేమ సంగతి బయటపెట్టారు, తన ప్రియురాలిని పరిచయం చేశారు, దీంతో అందరూ కూడా విషెస్ చెప్పారు.. దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగబోతున్న తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం అధికారికంగా వెల్లడించారు. కచ్చితంగా ఆ తేదిన పెళ్లి జరుగుతుంది అని ప్రకటించాయి ఇరు కుటుంబాలు.

ఇక ఇప్పటికే దగ్గుబాటి, బజాజ్ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. వచ్చేనెల ఆరు అలాగే 7 ఈ రెండు రోజుల్లో మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు, నిశ్చితార్దం కాకుండా నేరుగా వివాహం చేయనున్నారట.

ఆగస్టు 8న పరిమితంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరుగనుంది.. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే హజరు అవ్వనున్నారు, వేదిక త్వరలో వెల్లడిస్తారు.