బ్రేకింగ్ – ప్రముఖ హాస్య నటుడికి గుండెపోటు

బ్రేకింగ్ - ప్రముఖ హాస్య నటుడికి గుండెపోటు

0
95

తమిళ సినిమాల్లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందారు వివేక్ ,ఇటు తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్ర సీమలో ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు, ఇక తమిళనాడులో టాప్ 5 కమెడియన్స్ లో ఆయన ఒకరు, అందరు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన నటించారు, అయితే ఆయనకు తాజాగా గుండె పోటు వచ్చింది.

 

ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు… ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

 

వడపళనిలోని సిమ్స్ ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు.. ఇక గురువారం ఆయన కరోనా వాక్సిన్ వేయించుకున్నారు.. ఈ సమయంలో ప్రజలు అందరికి జాగ్రత్తలు తెలిపారు.. ప్రజలు అందరూ ఆస్పత్రికి వచ్చి వాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపారు, ఎలాంటి ఆందోళన వద్దని మాస్క్ లు ధరించాలి అని ప్రజలకు తెలిపారు, ఒక్కసారిగా ఆయనకు ఇలా గుండెపోటు వచ్చింది అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందారు… అయితే ఆయన కోలుకుంటున్నారని ఎవరూ కంగారు పడవద్దని ఆయన పర్సనల్ టీమ్ అభిమానులకి తెలిపింది.