బ్రేకింగ్ – పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం

బ్రేకింగ్ - పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం

0
83

టాలీవుడ్ లో మ‌రో విషాదం అల‌ముకుంది..ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి క‌న్నుమూశారు, టాలీవుడ్ లో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు, పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నో క‌ధ‌లు అందించారు, సినిమాల‌కు మాట‌లు అందించారు.

అయితే ఆయ‌న భార్య‌విజయలక్ష్మి గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు
ఆమె వయసు 74 సంవత్సరాలు. ఈ విష‌యం తెలిసిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంతాపాన్ని తెలిపారు.

ఆయన ఇంటికి చేరుకున్న పరుచూరి గోపాలకృష్ణ, సోదరుడ్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. వీరు హిట్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు, అలాగే అంద‌రూ అగ్ర‌హీరోల‌తో కొన్ని ద‌శాబ్దాలుగా చిత్రాలు చేస్తున్నారు. న‌టుడిగా ఆయ‌న ప‌లు చిత్రాల్లో న‌టించారు.