బ్రేకింగ్ – పవన్ కల్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్

బ్రేకింగ్ - పవన్ కల్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్

0
94

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత నెల కరోనా బారినపడిన విషయం తెలిసిందే, ఆయన తన ఫామ్ హౌస్ లోనే విశ్రాంతి తీసుకున్నారు, వైద్యులు ఆయన ఆరోగ్యం పై ఎప్పటి కప్పుడూ పరీక్షలు చేస్తూ ఉన్నారు, మొత్తానికి పవన్ కల్యాణ్ కు తాజాగా కరోనా పరీక్షలు చేస్తే నెగిటీవ్ వచ్చింది, ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.

 

ఆయనకు మూడు రోజుల క్రితం వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారని, అందులో నెగెటివ్గా నిర్ధారణ అయిందని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట ఓ ప్రకటన వచ్చింది. ఇక పవన్ కల్యాణ్ ఆరోగ్యంగా ఉన్నారు అని తెలిపారు, దీంతో ఆయన అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.

 

ఆయనకు కరోనా సోకింది అని తెలిసిన వెంటనే అభిమానులు ఎంతో బాధఫడ్డారు, ఆయన కోలుకోవాలి అని పూజలు చేశారు, ఎక్కడికక్కడ ప్రార్ధనలు చేశారు, ఇటు అభిమానులే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన కరోనా నుంచి కోలుకోవాలి అని ప్రార్ధించింది.