బ్రేకింగ్ – ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ కన్నుమూత

బ్రేకింగ్ - ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ కన్నుమూత

0
78

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది… ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ 86 రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్త విని చిత్ర సీమకు చెందిన ప్రముఖులు విషాదంలో ఉన్నారు, చాలా మంది అగ్ర దర్శకులు నిర్మాతలు హీరోలతో ఆయన వర్క్ చేశారు…ఎన్నో వందల సినిమాలకు వర్క్ చేసిన ఘనత ఆయన సొంతం.

మోహన్ జీ పూర్తి పేరు మాదిరెడ్డి కృష్ణ మోహన్ రావు… 1935లో గుంటూరులో పుట్టిన ఆయన చిన్నతనం నుంచే ఫొటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తితో స్టిల్ ఫొటోగ్రాఫర్గా ఎదిగారు… ఇక ఆయన సోదరుడితో కలిసి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చారు.

జగన్ మోహన్ రావుతో కలసి మోహన్ జీ- జగన్ జీ పేరుతో సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేశారు, ఇక ఎన్టీఆర్, కృష్ణ, ఏ ఎన్నార్, శోభన్ బాబు, మురళిమోహన్, ఇలా అందరు హీరోలతో ఆయన వర్క్ చేశారు.

సుమారు 900 చిత్రాలకు వీరు ఇద్దరు కలిసి స్టిల్స్ ఇచ్చారు . దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావుతో వీరిద్దరికీ మంచి అనుబంధం ఉండేది. ఇక ఆయన దాసరితో కలిసి సుమారు 100 సినిమాలకు పని చేశారు.. అంత మంచి బంధం ఉంది వీరి మధ్య. తెలుగు తమిళ కన్నడ చిత్రాలకు కూడా వీరిద్దరు పనిచేశారు, ఆయన మరణంతో అందరూ సంతాపం తెలిపారు.