తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు కిక్ శ్యామ్, అయితే కిక్ తో మంచి పేరు వచ్చింది, ఈ లాక్ డౌన్ వేళ అతని గురించి ఓ వార్త వినాల్సి వస్తోంది.
నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ ముసుగులో శ్యామ్ గ్యాంబ్లింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి ఎలాంటి అనుమతులు లేవు అని తెలుస్తోంది.
అయితే కొద్ది రోజులుగా స్ధానికంగా దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో.. పక్కా సమాచారంతో కోడంబాకం పోలీసులు ఫోకర్ క్లబ్‌పై దాడి చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ కోలీవుడ్ లో చాలా మంది నటులు ఆశ్చర్యపోయారు.