ఏదైనా ఓ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారు అంటే ఇక ఆ సినిమాపై అంచనాలు మాములుగా ఉండవు.. ఇక ముగ్గురు కలిసి నటిస్తే ఆ అభిమానులు ఈచిత్రం ఎప్పుడు వస్తుందా అనిచూస్తారు.. అలాంటిది ఏకంగా మొత్తం చిత్ర సీమలో ఉన్న అందరూ నటులు కలిసి సుమారు 140 మంది ఒకేసారి చిత్రంలో నటిస్తే.. నిజంగా ఎలా ఉంటుంది వినడానికే చాలా బాగుంది కదా అవును ఇది నిజంగా జరగబోతోంది.
140 మంది స్టార్స్ అందరూ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు..మలయాళంలో అగ్ర హీరోలైన మోహన్లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో మిగిలిన నటులు అందరూ కనిపిస్తారట, అయితే ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం . ఇంత మంది స్టార్స్ కలిసి నటించే క్రైమ్ థ్రిల్లర్ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.
అయితే అందరూ ఇలా ఒకేసారి ఎందుకు నటిస్తున్నారు అంటే, ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో చిత్ర సీమకు చెందిన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఉపాధి కరువు అయింది.. ఇక ఈ సినీ కార్మికులను ఆదుకోవాలని కేరళ సినీ నటుల సంఘం అమ్మ భావించింది.అందుకే ఇలా ఓ సినిమా తీయాలి అని భావిస్తున్నారు. ఈ సినిమాకి వచ్చే థియేట్రికల్ రైట్స్, రన్, ఇతర రైట్స్ ద్వారా వచ్చే డబ్బులను సినీ కార్మికులకు అందించాలని అమ్మ భావించింది. దేశంలో ఇది ఓ రికార్డు అనే చెప్పాలి.