బ్రేకింగ్ — సోనూసూద్ మ‌రోసాయం – ప్ర‌జ‌లు అభినంద‌న‌లు ఈసారి ఏం చేశారంటే

బ్రేకింగ్ --- సోనూసూద్ మ‌రోసాయం - ప్ర‌జ‌లు అభినంద‌న‌లు ఈసారి ఏం చేశారంటే

0
88

సోనూసూద్ ఈ క‌రోనా క‌ష్టకాలంలో పేద‌ల‌కు సాయం చేశారు, త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌లేక ఇబ్బందులు ప‌డుతున్న వేలాది మందిని త‌న సొంత ఖ‌ర్చుల‌తో విమానాలు రైల్లు బ‌స్సుల ద్వారా వారిని స్వ‌స్ధలాల‌కు పంపించారు, భోజ‌నం అందించారు షెల్ట‌ర్ అందించారు, లేదు అని సాయం కోరిన వారికి అన్నీ తానై ముందు నుంచి అభ‌య‌హ‌స్తం అందిస్తున్నారు.

తాజాగా మ‌రోసాయం చేశారు ఆయ‌న అయితే ఇది నిజంగా అద్బుతం అనే చెప్పాలి,
కాలేయ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఫిలిప్పీన్స్ నుండి న్యూ ఢిల్లీకి 39 మంది పిల్లల ప్రయాణానికి ఏర్పాట్లు చేయనున్నట్లు సోను సూద్ ప్రకటించారు. అక్క‌డ చిన్న పిల్ల‌లు విద్యార్దులు ఫిలిఫైన్స్ లో ఈ కాలేయ వ్యాధితో ఇబ్బంది ప‌డుతున్నారు.

వారు ఢిల్లీలో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఢిల్లీకి రాలేకపోతున్నారు.ఈ విష‌యం సోనుకి తెలిసింది..ఆ 39 మంది చిన్నారులు ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.. రెండు రోజుల్లో వారిని భార‌త్ కు తీసుకురానున్నారు. ఈ విష‌యం తెలిసి సోనూని అంద‌రూ అభినందిస్తున్నారు.