బ్రేకింగ్ — నాలుగేళ్ల తర్వాత జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్

-

జబర్దస్త్ కామెడీ షో బుల్లితెరలో ఎంత సంచలనమో తెలిసిందే.. కొన్ని సంవత్సరాలుగా టాప్ షోగా రికార్డులు నమోదు చేస్తోంది, ఇక ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు చిత్ర సీమకు పరిచయం అయ్యారు… పదుల సంఖ్యలో ఆర్టిస్టులు సినిమాల్లో నటిస్తున్నారు జబర్ధస్త్ నుంచి వచ్చినవారు.. ఇక యాంకర్లుగా రష్మి అనసూయ మంచి పేరు సంపాదించుకున్నారు, ఇద్దరూ బుల్లితెరలో షోలతో పాటు సినిమాలు చేస్తున్నారు.

- Advertisement -

ఇక సుడిగాలి సుధీర్ హైపర్ ఆది, శేషు, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఇలా చాలా మంది చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చారు, పలు సినిమాలు చేస్తున్నారు…. అయితే వీరితో పాటు మహేష్ కూడా జబర్ధస్త్ నుంచి సినిమాల్లోకి వెళ్లి మంచి పేరు సంపాదించుకున్నాడు.

గతంలో కిరాక్ ఆర్పీ స్కిట్లో కనిపించేవాడు తర్వాత రంగస్ధలం సినిమాలో మంచి రోల్ వచ్చింది అక్కడ నుంచి మహేష్ పేరు మార్మోగిపోయింది.. చరణ్ తో ఎక్కువ సేపు సీన్లలో కనిపించాడు మహేష్.. ఇలా మంచి పేరు వచ్చింది, అలాగే శతమానం భవతి లో కూడా మంచి రోల్ చేశాడు… ఇక తాజాగా మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇటీవల ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే… చాలా రోజుల తర్వాత మళ్లీ జబర్దస్త్ స్టేజీపై దర్శనం ఇచ్చాడు… గ్రాండ్ వెల్ కమ్ పలికారు అందరూ, అయితే స్కిట్ చేస్తాడా లేదా సినిమా ప్రమోషన్ కు వచ్చాడా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...