జబర్దస్త్ షో బుల్లితెరలో మంచి పేరు సంపాదించుకుంది.. తెలుగువారు లక్షలాది మంది జబర్దస్త్ కు అభిమానులు ఉన్నారు.
ఎంతో మంది కమెడియన్లు ఇక్కడ నుంచి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చారు, ఇక చాలా మంది ఏడు సంవత్సరాలుగా ఈ షో చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.. కొందరు కమెడియన్లు అయితే మరికొందరు హీరోలు అయ్యారు, ఇక సుడిగాలి సుదీర్ ఆది రాఘవ ధనరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మంచి స్టేజ్ కు చేరుకున్నారు.
జబర్ధస్త్ లో కమెడియన్గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ నుంచి సినిమాల్లో కమెడియన్ గా నటించారు, తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్, త్రీమంకీస్ సినిమాలు చేశారు. తాజాగా సుదీర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆర్మాక్స్ మీడియా గత సంవత్సరానికి సంబంధించి బుల్లితెర ఉత్తమ నటుల ఎంపికను చేసింది ఇందులో
ఉత్తమ ఎంటర్టైనర్ విభాగంలో తెలుగు నుంచి సుడిగాలి సుధీర్ ఎంపికయ్యాడు…సుదీర్ కు ఈ అవార్డు రావడంతో అతని ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు.