బ్రేకింగ్ సుశాంత్ మృతి కేసు మరో కొత్త ట్విస్ట్….. రంగంలోకి అధికారులు

0
116

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతోంది… తాజాగా మరో మలుపు తిరిగింది… ఈ కేసు సంబంధించిన దర్యాప్తుకు సీబీఐకి అప్పగించాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది…

సుశాంత్ మృతి తర్వాత దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని కోర్టు ముంబై పోలీసులకు ఆదేశించింది… దర్యాప్తులో సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది… కాగా 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

ఈ సంఘటనపై కేసున నమోదు చేసుకున్న పోలీసులు ఇండస్ట్రీకి చెందిన పలువురిని విచారించిన సంగతి తెలిసిందే… అతనికి సంబంధించిన లావాదేవాలపై కూడా విచారణ చేపట్టారు… తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది న్యాయస్థానం…