బ్రేకింగ్ – తమిళ చిత్ర సీమలో విషాదం – కమెడియన్ వివేక్ కన్నుమూత

బ్రేకింగ్ - తమిళ చిత్ర సీమలో విషాదం - కమెడియన్ వివేక్ కన్నుమూత

0
78

తమిళ చిత్ర సీమలో విషాదం నెలకొంది..గుండెపోటుతో నిన్న ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు వివేక్ ఈ తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది.

ఆయన వయసు 59 సంవత్సరాలు. గురువారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు ఆయన. ఇక ఆయన మరణించారు అని తెలిసి చిత్ర సీమకు చెందిన అందరూ కూడా ఆయనకు సంతాపం ప్రకటించారు.

 

వివేక్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, ఆరేళ్ల క్రితం డెంగీ జ్వరంతో ఓ కుమారుడు మృతి చెందాడు. ఆయన తల్లి కూడా మరణించారు.. ఈ విషాదంలోనే ఆయన కొంతకాలం ఉన్నారు, ఇక ఇటీవల తాను భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తున్నాను అని తెలిపారు, అంతేకాదు కమల్ తో ఎప్పటి నుంచో నటించాలి అనే కోరిక ఇన్నాళ్లకు తీరింది అని ఆనందించారు.

 

వివేక్ టీవీ హోస్ట్గా అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్ వంటి వారిని ఇంటర్వ్యూలు చేసి ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది, చెట్లు నరక్కుండా పర్యావరణం కాపాడాలి అని వివేక్ పలు ప్రచార కార్యక్రమాలు చేసేవారు.

వివేక్ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.