ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు ప్రమాదం జరిగింది అనే వార్త అందరిని కలవరపాటుకి గురిచేసింది, ఆయన అభిమానులు ఆయనకి ఏమైంది అని తెగ సెర్చ్ చేస్తున్నారు, అయితే ఆయన టీమ్ నేరుగా ఈ విషయం చెప్పడంతో అభిమానులకి తెలిసింది.
బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్ కారు వెళుతుండగా ఓ కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నటుడి కారు ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టు పక్కల జనం గుమికూడారు అంటూ ధ్వసమైన కారు ఫోటోను షేర్ చేసింది. అయితే ఆయనకు స్వల్పగాయాలు అయ్యాయి అని అనేక వార్తలు వినిపించాయి, కాని ఈ టీమ్ అందులో ఏమీ తెలియచేయలేదు.
గతంలో ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్ కు వెళ్లి 15 రోజులు ఉండమని వైద్యులు సూచించడంతో పూర్తిగా కోలుకున్నానని పృథ్వీ అప్పట్లో తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం గురించి టీమ్ మరో పోస్టు పెడితే బాగుంటంది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.