ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి. చాలా మంది ప్రముఖులు కరోనాతో మరణిస్తే మరికొందరు అనారోగ్య సమస్యలతో మరణించారు.. ఈ ఏడు నెలల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పదుల సంఖ్యలో నటులు దర్శకులు నిర్మాతలను కోల్పోయింది చిత్ర సీమ, అయితే తాజాగా మరో విషాదకరఘటన జరిగింది.
బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి ఆర్యా బెనర్జీ సౌత్ కోల్కత్తాలోని సొంత అపార్టెమెంట్లో శవమై కనిపించడం
ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది, అయితే ఇంటికి పని మనిషి వచ్చిన సమయంలో ఇంట్లో తలుపులు వేసి ఉన్నాయి. ఆమె తలుపులు ఎంతకీ తీయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారు వచ్చి చూడగా ఆమె మరణించి ఉంది, అయితే ఇంట్లో వాంతులు అయి ఉంది, అలాగే ఆమె ముఖానికి గాయాలు అయ్యాయి..
ఆర్యా బెనర్జీ తన ఇంట్లో బెడ్ రూమ్లో విగత జీవిగా పడిఉంది. ఆమె వయసు 33 సంవత్సరాలు. ప్రముఖ సితార వాద్యకారుడు నిఖిల్ బందోపాధ్యా చిన్న కూతురుగా ఇండస్ట్రీలో ఆమె అందరికి పరిచయం, అయితే ఆమె బాలీవుడ్ లోని ది డర్టీ పిక్చర్ లో నటించింది, అంతేకాదు LSD చిత్రంలో కూడా నటించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య జరిగిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.