వీఎంసీ ఆర్గనైజేషన్స్ అధినేత వి.దొరస్వామి రాజు అంటే తెలుగు చిత్ర సీమలో అందరికి తెలిసిన వ్యక్తే, ప్రముఖ నిర్మాత అలాగే
డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్లో గుండెపోటుతో కన్నుమూసారు . ఈ వార్త విని చిత్ర సీమ విషాదంలోకి వెళ్లిపోయింది.
ఇటు సినిమా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్.చెంగారెడ్డి వంటి ఉద్దండ నాయకునిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక పలు అవార్డులు వచ్చాయి ఆయనకు.. అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.
వీఎంసీ ఆర్గనైజేషన్ను 1978లో దొరస్వామి రాజు ప్రారంభించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా దీనిని ఆయన ప్రారంభించారు, ఇక అక్కినేని వారి కుటుంబంతో ఎన్నో సినిమాలు తీశారు ఆయన…అక్కినేని నాగార్జునతో అన్నమయ్య లాంటి గొప్ప ఆధ్యాత్మిక చిత్రాన్ని రూపొందించారు, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ మూవీని ఆయనే నిర్మించారు, ఆయన మరణంతో చిత్ర సీమ విషాదంలో మునిగిపోయింది.