బాలీవుడ్ లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది, ప్రముఖ నటుడు రిషి కపూర్, రణధీర్ కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ కన్నుమూశారు, ఆయన వయసు 58 ఏళ్లు, అయితే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే స్ధానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లారు, కాని అక్కడ వైద్యం చేస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు.
గతేడాది రిషి కపూర్ కన్నుమూయగా ఏడాది తిరగకముందే కపూర్ ఫ్యామిలీలో మరో విషాదం చోటుచేసుకుంది, కపూర్ కుటుంబం నుంచి అందరూ తరలి వస్తున్నారు. ఆయన నటుడిగా దర్శకుడిగా బాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నారు, ఇక ఆయన్నీ బీ టౌన్ లో ముద్దుగా చింపు అనే పేరుతో పిలుచుకుంటారు.
1991లో సూపర్ హిట్ సినిమా హెన్నాతో నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాజీవ్ కపూర్.
ఆయన మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది.. కరీనా కపూర్, కరిష్మా కపూర్ అందరూ ఆయన ఇంటికి చేరుకున్నారు.
#KareenaKapoorKhan and #KarismaKapoor leave for their uncle late #RajivKapoor residence with their mother #BabitaKapoor. The veteran actor passed away today at the age of 58.
Our condolences go out to the family. pic.twitter.com/xZSm8RYp2Q
— Filmfare (@filmfare) February 9, 2021