సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చాలా మంది నగరానికి వస్తూ ఉంటారు.. కాని వెయ్యిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే సక్సస్ అవుతారు… అయితే చాలా మంది వచ్చిన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ సినిమాలపై ప్యాషన్ తో ఇక్కడే ఉంటారు. మరికొందరు వేరే ఉద్యోగం వ్యాపారం చూసుకుంటారు…సినిమాలో ఒక్క పాత్రతో వారి లైఫ్ మారిన వారు ఎందరో ఉన్నారు, ఆ లైఫ్ కోసం చాలా మంది చూస్తారు.
సినిమా అవకాశాలు లేక.. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ నటుడు చివరకు తనువు చాలాలించాడు. ఆ నటుడ్ని మనం ఒక్కసారి మాత్రమే చూశాం సినిమాలో.. చేసిన ఆ పాత్రతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు..తమిళ హీరో భరత్ నటించిన కాదల్ అనే సినిమా గుర్తు ఉందా, ఇది తెలుగులో ప్రేమిస్తే అనే సినిమాగా వచ్చింది, ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమాలో విరుచ్చగకాంత్ అనే నటుడు చిన్న పాత్రలో నటించాడు. సినిమాలో ఈ పాత్ర అందరికి బాగా నచ్చింది, ఎలాగైనా హీరో అవ్వాలి అని ఆ ఫోటోలు పట్టుకుని కనిపిస్తాడు, ఇక సినిమాలో మంచి పేరు వచ్చింది, తాజాగా ఆ నటుడు కన్నుమూశాడు ఇటీవలే అతడి తల్లిదండ్రులు కాలం చేశారు. మానసికంగా కృంగిపోయాడు విరుచ్చగకాంత్ ..చివరకు ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో చనిపోయాడు. చూసిన చాలా మంది చలించిపోయారు.
ReplyForward
|