మామా అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో(BRO Movie) జులై 28న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే మొదటి మూడు రోజులు దుమ్మురేపిన కలెక్షన్స్ తర్వాత ఘోరంగా పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి హెవీ డ్రాప్స్ సొంతం చేసుకుంది. మొత్తం మీద 7వ రోజు రూ. 60 లక్షల దాకా షేర్ ని అందుకోగా 8వ రోజు మాత్రం రూ. 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. మొదటి వారం ముగిసేసరికి బ్రో(BRO Movie) సినిమా కలెక్షన్స్ పవన్ కల్యాణ్ స్టామినాకు తగ్గ వసూళ్లు మాత్రం రాలేదు.
ఇందుకు వివిధ కారణాలను సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బ్రో సినిమా ‘వినోదయ సిత్తం’ రీమేక్ గా తెరకెక్కింది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఓటీటీలో చాలా మంది అప్పటికే చూసేశారు. దీంతో సినిమా కంటెంట్ మొత్తం అందరికీ అర్థమైపోయింది. అయితే తెలుగులో పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇమేజ్ కు తగ్గట్లు మార్పులు చేసినా మాతృక మాత్రం అలాగే ఉంది. దీంతో పవర్ స్టార్ అభిమానులు తప్పితే సాధారణ అభిమానులు సినిమా చూసేందుకు మొగ్గు చూపలేదు. దీంతో మొదటి మూడు రోజుల తర్వాత సినిమా కలెక్షన్స్ పడిపోయాయని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ను పోలుస్తూ చిత్రంలో ఓ సన్నివేశం ఉండటంతో వివాదానికి దారి తీసింది. దీంతో వైసీపీ అభిమానులు కూడా సినిమాకు దూరంగా ఉన్నారు. మొత్తంగా సినిమా వసూళ్లు మాత్రం దారుణంగా పడిపోయాయి.
ఓసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరిశీలిస్తే..
నైజాం: రూ. 19.87 కోట్లు
సీడెడ్: రూ. 6.52 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 6.59 కోట్లు
ఈస్ట్: రూ. 4.63 కోట్లు
వెస్ట్ : రూ. 4.22 కోట్లు
గుంటూరు: రూ. 4.35 కోట్లు
కృష్ణ : రూ. 3.21 కోట్లు
నెల్లూరు: రూ. 1.62 కోట్లు
తెలుగు రాష్ట్రాలు మొత్తం:- రూ. 51.01 కోట్లు (రూ. 80.35CR గ్రాస్)
KA+ROI: రూ. 5.76 కోట్లు
ఓవర్సీస్: రూ. 6.85 కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం: రూ. 63.62 కోట్లు (రూ. 106.60CR గ్రాస్)