బుల్లెట్ బండి సాంగ్ సింగర్ మోహన భోగరాజు మరో సాంగ్ లో రెచ్చిపోయిన హిరోయిన్

Bullet cart song singer Mohana Bhogaraju is the provoked heroine in another song

0
87

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కాంబోలో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన లడ్డుండా పాట, “నా కోసం మారావా నువ్వు ..లేక నన్నే మార్చేశావా నువ్వు, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ నుండి వాసివాడి తస్సదియా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. బుల్లెట్ బండి సాంగ్ మోహన భోగరాజు మరో సాంగ్ లో హిరోయిన్ రెచ్చిపోయింది. ఇక ఇందులో చిట్టి తో కలిసి..నాగార్జున,చైతన్య కలిసి డాన్స్ వేయడం బాగా ఆకట్టుకుంటోంది. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్టెప్పులతో ఆడిపాడింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. ఇక అంతే కాకుండా ఈ పాట కోసం ఒక స్పెషల్ తబలాతో పాటు ఒక ఫ్రెష్ ట్యూన్ కూడా కంపోజ్ చేయడం జరిగింది.

ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మనం సినిమా తర్వాత నాగార్జున, చైతన్య కలిసి పాటలో స్టెప్పులేయడం విశేషం.ఇక నాగార్జునకు రమ్యకృష్ణ, నాగచైతన్యకు కృతి శెట్టి జోడీగా నటిస్తున్నారు. ఇక ఇందులో కొందరు ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.