అందాల భామ శ్రీలీలకు బంపర్ ఆఫర్..ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్?

Bumper offer for beauty queen Sreesanth..Can Chance Against That Star Hero?

0
84

మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని ఇప్పుడు వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీ లీల. దర్శక దిగ్గజం అయిన రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ఈ మధ్యనే విడుదలైన “పెళ్లిసందD” సినిమా లో హీరోయిన్ గా నటించింది ఈ భామ. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన హీరోయిన్ గా కనిపించిన ఈమె మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు శ్రీలీల ముందు దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. అదే స్పీడులో శ్రీ లీల కూడా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తోంది. దీనితో ఈమెకు ఎన్టీఆర్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని తాజాగా నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశం అందుకుంది. ధమాకా అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకుడు. ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తైందని చిత్రబృందం తెలిపింది.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్‌లో ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.  పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కబోయే ఎన్టీఆర్ మూవీలో ఈ అప్‌కమింగ్ హీరోయిన్‌కు అవకాశం ఇస్తారా లేదా చూడాలి మరి. అదే జరిగితే శ్రీలీలకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం కూడా ఉంది.