బన్నీని బావా అంటూ పిలిచిన ఎన్టీఆర్ ఏమన్నారంటే

బన్నీని బావా అంటూ పిలిచిన ఎన్టీఆర్ ఏమన్నారంటే

0
98
NTR

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అల..వైకుంఠపురములో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమాను చూసిన వారు అందరూ కూడా బన్నీ నటకు త్రివిక్రమ్ దర్శకత్వానికి కితాబులు ఇస్తున్నారు

తాజాగా ఈ సినిమా చూసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా బ‌న్నీ, త్రివిక్ర‌మ్ స‌హా యూనిట్‌ను అభినందించారు. చాలా ఇష్టంగా అద్భుతంగా న‌టించిన అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్‌గారి బ్రిలియంట్ రైటింగ్ కార‌ణంగా `అల వైకుంఠ‌పుర‌ములో` చాలా గొప్ప‌గా రూపొందింది. బావా, సామీల‌కు కంగ్రాట్స్‌ అంటూ ట్వీట్ చేశారు.

అయితే దీనిపై బన్నీ అభిమానులు తారక్ అభిమానులు ఈ ట్వీట్ వైరల్ చేస్తున్నారు, అయితే బన్నీ ఎన్టీఆర్ చాలా క్లోజ్ బావా అని పిలవడంతో వీరిద్దరి మధ్య ఎంత బలమైన రిలేషన్ ఉందో తెలుసుకోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్ .