బ‌న్నీ సినిమాలో ఆ సీన్ కోసం 6 కోట్లు స్పెషాలిటీ అదే

బ‌న్నీ సినిమాలో ఆ సీన్ కోసం 6 కోట్లు స్పెషాలిటీ అదే

0
99

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోంది పుష్ప చిత్రం, ఈ సినిమాకి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్ కు బ్రేకులుప‌డ్డాయి, ఇక ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది, ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌ని డిఫ‌రెంట్ లుక్ లో బ‌న్నీ క‌నిపించ‌నున్నారు, ఈ చిత్రం ఎర్ర‌చంద‌న్ స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది.

ఇక బ‌న్నీ ఇందులో లారీ డ్రైవ‌ర్ గా న‌టిస్తున్నారు, ప‌క్కా మాస్ గా బ‌న్నీ షేడ్ ఉంటుంది, అయితే ఈ సినిమాలో అడవి నేపథ్యంలో ఛేజింగ్ తో కూడిన ఒక యాక్షన్ సీన్ ను ప్లాన్ చేశారట. తెరపై ఈ ఫైట్ సీన్ 6 నిమిషాల పాటు వుంటుందట. ఈ 6 నిమిషాలకి గాను 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. సినిమాకి ఇది హైలెట్ సీన్ అవుతుంది అని భావిస్తున్నారు.

దీని కోసం ఇప్ప‌టికే ప్లాన్ పూర్తి అయింది, ఇక లాక్ డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత షూటింగ్ మొద‌లైతే ఇది షూట్ చేస్తారు అని అంటున్నారు. ఇక చిత్రంలో యాక్ష‌స్ సీన్స్ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఈ సినిమాలో డ్యాన్సుల్లో బ‌న్నీకి స‌రికొత్త స్టెప్స్ వేయించ‌నున్నార‌ట‌, అందుకే ఈ సినిమాలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి అంటున్నారు.