బన్నీ ఐకాన్ పై ప్రకటన అప్పుడు వస్తుందా – టాలీవుడ్ టాక్

బన్నీ ఐకాన్ పై ప్రకటన అప్పుడు వస్తుందా - టాలీవుడ్ టాక్

0
117

మొత్తానికి బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు, అయితే ఆయన అభిమానులు ఐకాన్ సినిమా గురించి ఎంతో ఎదురుచూస్తున్నారు… ముఖ్యంగా ఐకాన్ సినిమాని అనౌన్స్ చేశారు గతంలో…దీనికి దిల్ రాజు నిర్మాత వేణుశ్రీరామ్ దర్శకుడు అని తెలిపారు….అయితే తర్వాత మళ్లీ దీని గురించి ఎలాంటి ప్రకటన రాలేదు… తర్వాత బన్నీ అల వైకుంఠపురం చిత్రం చేశారు.

 

ఇక తాజాగా ఐకాన్ సినిమా గురించి ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా విడుదల ఉంది.. ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతుంది అనేది తెలిసిందే.. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత వేణు శ్రీరామ్- బన్నీ ఐకాన్ సినిమాపై క్లారిటీ వస్తుంది అని అభిమానులు భావిస్తున్నారు.

 

అయితే దీనిపై కచ్చితంగా వకీల్ సాబ్ సినిమా విడుదల అయిన తర్వాత కీలక ప్రకటన వస్తుంది అని ఎదురుచూస్తున్నారు…ఇటీవల వకీల్ సాబ్ చిత్ర ప్రమోషన్లో దర్శకుడు వేణుశ్రీరామ్ ని పలువురు అడిగారు, ఐకాన్ పరిస్థితి ఏమిటని, ఆ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేననీ, వకీల్ సాబ్ రిలీజ్ తరువాత తన తదుపరి ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వస్తుందని అన్నారు.