బన్నీ కోసం ఆ సినిమాలో 39 కోట్లు ఖర్చు చేశారా ? టాలీవుడ్ టాక్

బన్నీ కోసం ఆ సినిమాలో 39 కోట్లు ఖర్చు చేశారా ? టాలీవుడ్ టాక్

0
62

అల్లు అర్జున్ సినిమా వస్తోంది అంటే అభిమానులకి పండుగ అనే చెప్పాలి.. అయితే ఆయన డ్యాన్సులకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు… స్టైలిష్ లుకింగ్ నటనతో తనదైన మార్క్ చూపిస్తారు బన్నీ.. ఇక ఆయన చేసే సినిమాలు కథలపై కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.. ఆయన సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, అయితే ఈ సినిమాలో అనేక యాక్షన్ సీన్స్ ఉన్నాయి.

కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే 39 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు భారీ ఫైట్లు రిస్కీ షాట్లు చాలా ఉన్నాయి అని టాక్ నడుస్తోంది.

 

పాన్ ఇండియాగా వస్తున్న ఈ చిత్రం పై బన్నీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఇక బన్నీ తగ్గెదేలే అంటూ చెప్పై డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో నిర్మాతలు కూడా ఖర్చు విషయంలో తగ్గలేదు అని తెలుస్తోంది…ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ కుర్రాళ్లను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు.. ఆగస్టు 13న ఈ సినిమా విడుదల కానుంది. మరి చూడాలి కరోనా పరిస్దితుల వల్ల అనుకున్న సమయానికి సినిమా వస్తుందా లేదా ఇంకా సమయం తీసుకుంటుందా అనేది.