బన్నీ నెక్ట్స్ మూవీలో… ఎలాంటి పాత్రలో నటించనున్నాడో తెలిసిపోయిందోచ్… మరీ ఇంత మాస్ క్యారెక్టరా

బన్నీ నెక్ట్స్ మూవీలో... ఎలాంటి పాత్రలో నటించనున్నాడో తెలిసిపోయిందోచ్... మరీ ఇంత మాస్ క్యారెక్టరా

0
90

తన కెరియర్ లో ఇంతవరకు అల్లు అర్జున్ ను చూడని విధంగా చూపిస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ పూనుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది…తాజాగా రూపొందుతున్న చిత్రం లారీ డ్రైవర్ సినిమాలో బన్నీ ఊరా మాస్ లుక్ లో కనిపిస్తారని టాక్…

లుంగీ కట్టుకోని లారీ స్టీరింగ్ పట్టుకుని గతఏడాది కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా లుక్ లో రానున్నాడని టాక్ గతంలో సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో లవర్ భాయ్ పాత్రలను మాత్రమే మనం చూశాం కానీ ఈ సారి బన్నీని ఊరా మాస్ లుక్ లో చూపించనున్నాని గుసగుసలు వినిపిస్తున్నాయి…

ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న లారీ డ్రైవర్ పాత్రను ఖైదీ సినిమాలోని కార్తీ పాత్రను మూలంగా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది…. ఖైదీ సినిమాలో లారీ డ్రైవర్ గా కార్తీ జీవించాడు మరి స్టైల్ గా ఉండే అల్లు అర్జున్ ఊరా మాస్ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే…