బ‌న్నీ పుష్ప స్టోరీ ఇదేన‌ట – బ‌న్నీ ఫ్యాన్స్ చ‌ర్చ‌

బ‌న్నీ పుష్ప స్టోరీ ఇదేన‌ట - బ‌న్నీ ఫ్యాన్స్ చ‌ర్చ‌

0
90

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో తాజాగా సినిమా తెర‌కెక్కుతోంది, ఈ సినిమా పేరు పుష్ప అని తాజాగా టైటిల్ రివీల్ చేశారు, ఇక బ‌న్నీ సుకుమార్ కు ఈ చిత్రం మూడోది, దీంతో ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.

సుకుమార్ రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత బన్నీ కోసం ఎంతో జాగ్రత్తగా రాసుకున్న కథ ఇది. అల్లు అర్జున్ 20వ సినిమా కావ‌డంతో దీనిపై బాగా ఎఫెర్ట్ పెడుతున్నారు.

బ‌న్నీ మార్కెట్ పెర‌గ‌డంతో అన్ని దక్షిణాది ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా గురించి తాజాగా ఓ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది, ఈ సినిమా క‌థ ఇలాగే ఉంటుంది అని తెలుస్తోంది.

కథలో త్రీషేడ్స్ ఉంటాయని సమాచారం. ఒకటి ఎర్రచందనం స్మగ్లర్‌గా, రెండోది బిజినెస్ మాన్‌గా, మూడోది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనబడతాడని సమాచారం. అయితే ఇందులో హీరోయిన్ పేరు పుష్ప అని తెలుస్తోంది, అంతేకాదు బ‌న్నీ న‌డిపే లారీ పేరు పుష్ప అని టాక్ న‌డుస్తోంది, ఇంకొంద‌రు ఈ గ్రూప్ అంతా క‌లిసి పుష్ప అనే పేరు పెట్టుకుంటారు అని అంటున్నారు. కాని ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా. ఫైన‌ల్ గా వెండితెరైనే చూడాలి ఈ స్టోరీ ఏమిటో.