బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా

బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా

0
104

టాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ మాములుగా ఉండ‌దు, ఆయ‌న‌కు స్టార్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే, ఇక ఆయ‌న సినిమా వ‌చ్చింది అంటే తెలుగు త‌మిళ క‌న్న‌డ మ‌ళ‌యాళ అభిమానులు క‌చ్చితంగా చూడాల్సిందే అంటారు.. అన్నీ సినిమా ప‌రిశ్ర‌మ‌లో బ‌న్నీకి ఫ్యాన్స్ ఉన్నారు.

అల్లు అర్జున్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భారీగా ఆయన పారితోషికం పెరిగింది అంటున్నారు… దీనికి కార‌ణం ఇటీవ‌ల విడుద‌ల అయిన అల వైకుంఠ‌పురం చిత్రం. ఆయ‌న‌కు మంచి విజ‌యం తెచ్చింది, ఈ స‌మ‌యంలో ఈ చిత్రం 150 కోట్ల షేర్ వ‌సూలు అయింది.

దీంతో బ‌న్నీ మార్కెట్లో అద‌ర‌గొట్టాడు, అందుకే త‌న త‌దుప‌రి చిత్రానికి కూడా బ‌న్నీ ఆ రేంజ్ డిమాండ్ చేస్తున్నార‌ట‌, ఇక తాజాగా బ‌న్నీకి 20 నుంచి 25 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఉంటే దానిని 35 నుంచి 40 కోట్లు చేశారు అని వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే బ‌న్నీ ఫ్యాన్స్ మాత్రం క‌చ్చితంగా ఆ రేంజ్ ఉన్న హీరో కాబ‌ట్టి అలా తీసుకోవ‌డంలో త‌ప్పు లేదు అంటున్నారు, నిజ‌మే బ‌న్నీ సినిమా వ‌సూళ్లు అలా ఉన్నాయి కాబ‌ట్టి ఆయ‌న ఆ రేంజ్ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌వ‌చ్చు అంటున్నారు.