బ‌న్నీ సుకుమార్ చిత్ర టైటిల్ ఇదేనా

బ‌న్నీ సుకుమార్ చిత్ర టైటిల్ ఇదేనా

0
138

అల వైకుంఠ‌పురం చిత్రం ఘ‌న‌విజ‌యంతో బ‌న్నీ త‌ర్వాత సినిమా స్టార్ చేశారు అదే సుకుమార్ చిత్రం.. ఇక ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న వేళ క‌రోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోయింది, ఇక ఈ నెల 14 త‌ర్వాత ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

తన కెరీర్లో 20వ మూవీని డైరెక్టర్ సుకుమార్ కు బ‌న్నీ అప్ప‌గించాడు..మైత్రీ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక బ‌న్నీతో ఈ చిత్రంలో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి నిటిస్తున్నారు. ఇక హీరోయిన్ గా బ్యూటీ ర‌ష్మిక‌ని తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలో పూర్తిగా బ‌న్నీ త‌న లుక్ మార్చాడు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవరుగా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సింహాచలం అనే పేరుపెట్టారు అని వార్త‌లు వ‌చ్చాయి కాని ఇది వాస్త‌వం కాదు అని చిత్ర యూనిట్ చెప్పింది. ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ టైటిల్‌ని ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు, ఆర్య టైపు రెండు అక్ష‌రాల‌తో టైటిల్ ఫిక్స్ చేస్తున్నార‌ట‌.