బన్నీ సుకుమార్ సినిమాపై న్యూ అప్ డేట్

బన్నీ సుకుమార్ సినిమాపై న్యూ అప్ డేట్

0
93

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా చేసిన చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతికి విడుదల అవ్వనుంది.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ లైట్ గెడ్డంతో కనిపించనున్నాడు. అయితే ఆయన లుక్ ట్రైలర్ టీజర్ ఫస్ట్ లుక్ లో అర్దం అయింది.

అయితే ఇక ఈ సినిమా పూర్తి అయింది.. తర్వాత ఆయన చేయబోయే చిత్రం దర్శకుడు సుకుమార్ తో .. ఇక ఈ చిత్రంలో ఆయన ఏ లుక్ లో ఉంటారు అనేది పెద్దగా అభిమానులు చర్చించుకుంటున్నారు, తాజాగా అల వైకుంఠపురంలో ఈవెంట్ కు వచ్చిన బన్నీ ఓ మాదిరిగా పెరిగిన గెడ్డంతో కనిపించాడు.

దీంతో సుకుమార్ తో చేయనున్న సినిమా కోసమే బన్నీ గెడ్డం పెంచుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అందుకే లుక్ అలా ఉంది అని చెబుతున్నారు…ఇరవై ఏళ్ల క్రితం చిత్తూరు ప్రాంతానికి చెందిన కుర్రాడిగా, కాస్ట్యూమ్స్ పరంగాను ఆయన కొత్తగా కనిపిస్తాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందట, ఇందులో స్మగ్లర్ గా కనిపించనున్నారు బన్నీ, ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం నిర్మిస్తున్నారు.