బన్నీ తన చెడ్డీ దోస్త్ కు బంపర్ ఆఫర్…

బన్నీ తన చెడ్డీ దోస్త్ కు బంపర్ ఆఫర్...

0
111

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున ప్రస్తుతం పుష్ప చిత్రం చేస్తున్నాడు.. లాక్ డౌన్ ముందు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొంత పూర్తి చేసుకుంది.. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ బంద్ అయింది… దీంతో బన్నీ ఒక వైపు పుష్ఫ కోసం ప్రిపరేషన్ , ఫిజికల్ ఫిట్ నెస్ వర్కౌంట్ చేస్తూనే మరో వైపు వరుస కథలు వింటూ వాటిని ఒకే చేస్తున్నారని టాక్…

ఇప్పటికే ఇద్దరు దర్శకులను ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి… ఈ క్రమంలో కొరటాల శివతోబన్నీ కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి… కరోనా వైరస్ విజృంభనవల్ల ఆచార్య వాయిదా పడిన సంగతి తెలిసిందే…

ఈ క్రమంలోనే బన్నీ కొరటాలతో కమిట్ అయ్యారని టాక్… ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని చిన్ననాటి స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తారని సమాచారం… సుధాకర్ కొరటాలకు కూడా స్నేహితుడు… వీరిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన బన్నీ వీరితో సినిమా తీయనున్నాడని టాక్…