భార్య గురించి కీలక విషయం చెప్పిన బన్నీ

భార్య గురించి కీలక విషయం చెప్పిన బన్నీ

0
105

అల వైకుంఠపురములో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు బన్నీ, అంతేకాదు ఈ సినిమా తన పాత రికార్డులు అన్నీ కూడా దాటేసింది వసూళ్ల పరంగా. ఇక బాలీవుడ్ లో కూడా ఇది రీమేక్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, అయితే తాజాగా ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

శేషాచలం అడవుల బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరికొత్త లుక్తో కనిపించనున్నాడట. ఇక బన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమయంలో తన భార్య గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు, బన్నీకి చాలా మంది టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉన్నారు కేరళలో కూడా అలాగే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, అయితే మహిళా అభిమానుల విషయంలో తన భార్య చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పాడు.

నా మహిళా అభిమానులు నా వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నా అని చెప్పాడు బన్నీ, అయితే నా అభిమానులు అందరికి తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం తెలుసు అని చెప్పాడు, మంచి కథ దొరికితే కచ్చితంగా బాలీవుడ్ లో నటిస్తా అన్నాడు బన్నీ.