చిరు సినిమాలో బన్నీ ,, చరణ్ నో

చిరు సినిమాలో బన్నీ ,, చరణ్ నో

0
108

తాజాగా చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది ..ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు, అంతేకాదు ఈ చిత్రంలో చరణ్ కూడా ఓ ప్రముఖ పాత్ర చేయనున్నారు అని వార్తలు వినిపించాయి, ఆయన మరో రెండు నెలల్లో షూటింగులో పాల్గొంటారు అని వార్తలు వినిపించాయి.

అయితే మరోసారి టాలీవుడ్ లో చరణ్ పాత్ర గురించి సరికొత్త వార్త వినిపిస్తోంది, ఇది సందేశం ఇచ్చే పూర్తి వినోధభరిత సినిమాగా తీస్తున్నారు. ఇందులో కధానాయిక త్రిష, అయితే చరణ్ ఈ సినిమాలో నటించడం లేదట.

రాజమౌళి సినిమా షరతుల ప్రకారం, ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యేవరకూ చరణ్ మరో ప్రాజెక్టును అంగీకరించకూడదు, ఆ సినిమాకి ముందు .. చరణ్ చేసిన మరో సినిమా విడుదల కాకూడదట. అందుకే కొరటాల సినిమాలో చరణ్ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. అందుకే ఆ పాత్ర కోసం అల్లు అర్జున్ ని అడిగారట, అయితే సుకుమార్ తో సినిమా చేస్తున్న బన్నీ తాజాగా అక్కడ మూడు షెడ్యూల్స్ పూర్తి అయ్యాక చేస్తాను అని చెప్పారని టాక్ అయితే నడుస్తోంది.