సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వార్తలు వస్తే నిమిషాల్లో కోట్ల మందికి చేరిపోరిపోతాయి.. ఏదైనా సంఘటన గురించి అయినా న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది, ఇక తమ అభిమాన నటుడి గురించి తెలుసుకోవాలి అని చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు నెట్టింట, మరీ ముఖ్యంగా ఇలాంటి వారు చాలా మంది ఉంటారు.
ప్రతీ ఏడాది ఇలా టాప్ సెర్చింగ్ లిస్ట్ కూడా బయటకు వస్తుంది.. ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు అనే విషయంలో.. తాజాగా ఈ 2020 సంవత్సరంలో కరోనా వైరస్ తో పూర్తిగా ఆరు నెలలు లాక్ డౌన్ ఉంది.
ఈ సమయంలో చాలా మంది సోషల్ మీడియాలో నెట్టింట పూర్తి సమయం గడిపారు.
యాహూ వేదికగా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 సెలబ్రిటీల జాబితా విడుదల అయింది, అందులో మన బన్నీ అల్లు అర్జున్ కూడా రికార్డు క్రియేట్ చేశాడు.
మొదటి స్ధానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉంటే
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రెండో స్థానంలో ఉన్నారు
లాక్ డౌన్ లో భారీ సాయం చేసిన అక్షయ్ కుమార్ మూడవ ప్లేస్ లో ఉన్నారు
ఇక సల్మాన్ నాలుగో స్ధానంలో ఉన్నారు
ఇర్ఫాన్ ఖాన్ ఐదవ స్ధానం
రిషీ కపూర్ ఆరవ స్ధానం
ఎస్పీ బాలుగారు ఏడో స్దానం
సోనూ సూద్ ఎనిమిదో
అనురాగ్ కశ్యప్ తొమ్మది
అల్లు అర్జున్ 10 వస్ధానంలో నిలిచారు.