బన్నీ కూతురు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

బన్నీ కూతురు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

0
103

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన పిల్లలతో చాలా సరదాగా ఉండే వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు, వారి సరదా సంభాషణలు కూడా షేర్ చేస్తారు ఆయన, అయితే బన్నీకి ఓ కూతురు ఓ కుమారుడు అనే విషయం తెలిసిందే, అయితే తాజాగా ఆయన కుమార్తె అర్హ గురించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు..

అర్హ ఇవాళ హీరో నిఖిల్ కొత్త ప్రాజెక్టు 18 పేజీస్ ముహూర్తం షాట్ కు తన తాత అల్లు అరవింద్ తో కలిసి చీఫ్ గెస్టుగా హాజరైంది. ఈ సందర్భంగా అర్హ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ, అర్హ చాలా అదృష్టవంతురాలని పేర్కొన్నారు. చిన్న వయసులో ఇలా షూటింగ్ కు వెళ్లడమే కాదు చీఫ్ గెస్ట్ గా వెళ్లే అవకాశం తనకి దక్కింది అన్నారు.

ఇది తాజాగా నిఖిల్ తన ట్విట్టర్ లో తన సినిమా సంతోషాన్ని పంచుకున్న సందర్బంలో బన్నీ చేసిన కామెంట్, ఇక ఈ సమయంలో తను చాలా లక్కీ అని అన్నాడు, అంతేకాదు నాకు అయితే ఇలా చీఫ్ గెస్ట్ గా రావడానికి 23 సంవత్సరాలు పట్టింది అని అర్హ చిన్నవయసులో ఈ ఛాన్స్ దక్కించుకుంది అనిమురిసిపోయాడు బన్నీ, అంతేకాదు నిఖిల్ సినిమాకి బెస్ట్ విషెస్ చెప్పారు.