ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులది ఎంతో ముచ్చటైన జంట. వేడుకల్లో, పండగల్లో ఈ జంట చేసే హడావుడికి అభిమానులు ఫిదా అయిపోతుంటారు. తన పిల్లలు అయాన్, అర్హాలతో బన్నీ చేసే సందడి అంతా ఇంతా కాదు. మీడియాకు దూరంగా ఉన్నా..కుటుంబంలోని ఈ సంతోషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో సామాజిక మాధ్యామాల్లో పంచుకుంటుంది స్నేహ.
‘పుష్ప’ చిత్రీకరణలో ఇన్ని రోజులూ బిజిబిజీగా గడిపిన బన్నీ..ఇటీవలే కుటుంబంతో మాల్దీవులు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ ఓ పడవలో అతడితో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది స్నేహ. దానికి ‘నువ్వు నాతో ఉన్నంత కాలం ప్రతిదీ బాగుంటుంది’ అని కామెంట్ పెట్టింది. ఈ వీడియో చూసిన అభిమానులు..ఈ బన్నీ దంపతుల సాన్నిహిత్యానికి ముచ్చటపడిపోతున్నారు.
https://www.instagram.com/p/CVMrpYFDkjG/