బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్ని..పుష్పకు ఎన్ని కోట్ల కలెక్షన్లో తెలుసా?

Bunny turned into a gold mine for Bollywood

0
108
Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా  చిత్రం ‘పుష్ఫ’. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను అస్సలు హిందీలో రిలీజ్​ చేయకూడదని అనుకున్నారు. కానీ చేశారు. అయితే ఎలాంటి పబ్లిసిటీ కూడా చేయకపోవడం వల్ల ఈ సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుందోనని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలకు కూడా అందకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు సొంతం చేసింది.

 ‘పుష్ప’ హిందీ వెర్షన్ఆదివారంతో కలిసి దాదాపు రూ.100 కోట్ల నెట్​ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ వస్తూనే ఉండటం మరో విశేషం. ‘పుష్ప’ హిందీ వెర్షన్.. ఆదివారంతో కలిసి దాదాపు రూ.100 కోట్ల నెట్​ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ వస్తూనే ఉండటం మరో విశేషం. బాలీవుడ్ లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో ఎక్కువగా ప్రమోట్ చేయకపోయినా కేవలం డబ్బింగ్ వెర్షన్‌తోనే రికార్డుల మోత మోగించేస్తోంది.
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్​ లుక్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాట, ‘పుష్పరాజ్’ డైలాగ్​ అయితే ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేక చెపాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, బాలీవుడ్​ సెలబ్రిటీలతో పాటు ఎంతోమంది ఈ రెండింటిని రీల్స్, టిక్​టాక్ వీడియోలు చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచేశారు. అల్లు అర్జున్​ నటనకు కూడా ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు.