బన్నీ – విజయ్ దేవరకొండ సినిమా టాలీవుడ్ టాక్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాని సెట్స్ పై పెట్టారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా అప్ డేట్స్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు, ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తారా అని కూడా ఎదురుచూస్తున్నారు మరో సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తారని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఈ లాక్ డౌన్ వేళ కొన్ని కథలు విన్నారు బన్నీ, తాజాగా వాటిలో ఒకటి ఫైనల్ చేస్తారు అని అంటున్నారు, అయితే తాజాగా టాలీవుడ్లో మరో వార్త వినిపిస్తోంది, రౌడీ హీరో విజయ్ దేవరకొండ బన్నీ కలిసి నటించబోతున్నారు ఓ చిత్రంలో అని వార్తలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ మహి.వి.రాఘవ్ ఓ మంచి క్రేజీ కథ వినిపించారని వార్తలు వస్తున్నాయి ఇది మల్టీస్టారర్ అంటున్నారు, ఇక ఈ కథ ఇద్దరికి నచ్చడంతో వారు ఈ సినిమా చేస్తారు అని టాక్ నడుస్తోంది..ఆఫ్స్క్రీన్లో బన్నీ, విజయ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. విజయ్ కూడా బన్నీకి పలుసార్లు అనేక రకాల దుస్తులు పంపించిన విషయం తెలిసిందే , అయితే కొరటాల శివ సినిమా తర్వాత ఈ చిత్రం ఉండచ్చు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...