Breaking: గాయకుడు బప్పి లహిరి కన్నుమూత

0
94

ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ బప్పి లహిరి కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యంగా హీందీ చిత్రాల‌తో పాటు తెలుగులో కూడా ప‌లు చిత్రాల‌కు బ‌ప్పీ ల‌హిరి సంగీతం అందించారు. సింహాసనం, సామ్రాట్‌, స్టేట్‌రౌడి, గ్యాంగ్‌లీడ‌ర్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించారు.