చరణ్ – శంకర్ సినిమాకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్

Burra Saimadhav dialogues for Charan - Shankar movie

0
131

సినిమాలో కొన్ని సంభాషణలు మనం వింటూ ఉంటాం. చాలా బాగున్నాయి ఈ మాటలు ఎవరు రాశారు అని అనుకుంటాం. ఇలా మన తెలుగులో సంభాషణలు రాస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బుర్రా సాయిమాధవ్.
కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకి అద్భుతమైన సంభాషణలు రాసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు ఆయన. ఇక అక్కడ నుంచి ఆయన చాలా బిజీ అయ్యారు.

చెప్పుకుంటూ వెళితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మాటలు రాశారు.గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు, ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలకూ మాటలు రాసి మంచి గుర్తింపు పొందారు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ , శాకుంతలం, ప్రభాస్ – నాగఅశ్విన్ చిత్రాలకు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు. ఇక త్వరలో దర్శకుడు శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకూ బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు. నేరుగా దర్శకుడు శంకర్ ని ఇటీవల ఆయన చెన్నైలో కలిశారట. అందుకు కారకులైన నిర్మాత దిల్ రాజు, చరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు బుర్రా సాయిమాధవ్. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.