బుట్టబొమ్మ సాంగ్ అదిరిపోయిందిగా…..!!

బుట్టబొమ్మ సాంగ్ అదిరిపోయిందిగా.....!!

0
108

అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురం సినిమా లోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమా పై మంచి అంచనాలను పెంచేస్తున్నారు చిత్ర నిర్మాతలు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తుండగా ఈ సినిమా నుంచి బుట్ట బొమ్మ అనే సాంగ్ ని నేడు రిలీజ్ చేశారు.. ఇప్పటికే తమన్ స్వరపరిచిన పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి.

ఇటీవలే టీజర్ కూడా అందరికి నచ్చేసింది.. అయితే బుట్టబొమ్మ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేలా చేశారు. ఈ అంచనాల నడుమ విడుదలైన ఈ పాట కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంది. మరో అందమైన ట్యూన్‌తో తమన్ సంగీత ప్రేమికులను కట్టిపడేశారు. ఈ సినిమా కి త్రివిక్రమ్ దర్శకుడు కాగా ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక యంగ్ సింగర్ అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. కాగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.